తెలంగాణ సాహిత్య అస్తిత్వ స్పృహ కాళోజీ

0

ప్ర‌జాక‌వికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
కాళోజీ పుర‌స్కార గ్ర‌హీత పెన్నాకు అభినంద‌న‌లు
న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 8:
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె” అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహ ను అందించారని అన్నారు. వారి స్ఫూర్తి ని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని సీఎం తెలిపారు.


తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నది అని అన్నారు. “పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది” అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామ కృష్ణ కు సీఎం కేసిఆర్ అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here