సీఎం కేసీఆర్‌కు స్పాండిలోసిస్‌

Date:

ఎడ‌మ చేయి నొప్పి అందుకే
అంత‌కు మించి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవు
వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వెల్ల‌డించిన య‌శోదా వైద్యులు
హైద‌రాబాద్‌, మార్చి 11:
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పరీక్షలు నిర్వహించిన సోమాజిగూడ యశోద హాస్పటల్ వైద్యబృందం స్పష్టం చేసింది. నీరసం, చేతి నొప్పితే యశోద హాస్పటల్ కు వచ్చిన సీఎం కెసిఆర్‌కి శుక్రవారం యశోద దవాఖాన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు.


సీఎం వ్యక్తిగత వైద్యులు, పిజీషియన్ ఎంవి రావు, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విష్ణురెడ్డి సారథ్యంలోని వైద్యుల బృందం ఈ పరీక్షలు నిర్వహించింది.
పరీక్షల అనంతరం వారు సోమాజిగూడ యశోదా దవాఖాన నుంచి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ గారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు. గుండెకు సంబంధించిన అన్ని పరీక్షల రిపోర్ట్ సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగానే సీఎం ఎడమ చేయి నొప్పిగా ఉంటున్నదని నిర్ధారించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇది వయసు రీత్యా వచ్చే సమస్యేనని డాక్టర్లు స్పష్టం చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సీఎం కెసిఆర్ గారికి సూచించినట్లు తెలిపారు. వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రిగారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు.


కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సీఎం కెసిఆర్ మధ్యాహ్నం 3 గం.లకు ప్రగతి భవన్ అధికార నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం వెంట కుటుంబ సభ్యులు సతీమణి శోభ, మనవడు హిమాన్షు, మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,మంత్రి హరీష్ రావు లతో పాటు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రెడ్యా నాయక్ లతో పాటు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు..సీఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిపి సి.వి.ఆనంద్, డిసిపి జోయల్ డేవిడ్ తదితరులున్నారు.


యశోద డాక్టర్ల బృందం ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
డాక్టర్ విష్ణురెడ్డి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్:
• ముఖ్యమంత్రి గారు గత రెండు రోజులుగా నీరసంగా ఉందన్నారు.
• ఈ రోజు ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్లు ఇంటికి వెళ్లి చూశారు.
• హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకుంటే మంచిదనడంతో సీఎం గారు అంగీకరించారు.
• దాంతో వారిని ఇక్కడ హాస్పిటల్ కు తీసుకొచ్చాం.
• ఎడమ చేయి నొప్పి ఎందుకొచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేశాం.
ఈ పరీక్షల విషయాలన్నీ డాక్టర్ ఎం.వీ.రావు, డాక్టర్ ప్రమోద్ గారు చెబుతారు.
డాక్టర్ ప్రమోద్ కుమార్, చీఫ్ కార్డియాలజిస్ట్. యశోద హాస్పిటల్, సోమాజిగూడ
• ముఖ్యమంత్రిగారిని డాక్టర్ ఎంవీ రావు గారూ, నేను వారి ఇంటికెళ్లి పరిశీలించాం.
• కొన్ని టెస్టులు చేయాలని వారికి చెప్పడం జరిగింది.
• అందుకని వారిని ఇక్కడ హాస్పిటల్ కు రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది.
• ముఖ్యంగా ఎడమ చేయి నొప్పి అని చెప్పారు కాబట్టి, కరోనరీ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనే ఉద్దేశ్యంతో కరోనరీ యాంజియోగ్రాం చేశాం. అందులో అదృష్టవశాత్తూ బ్లాక్స్ ఏమీ లేవు.


• హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఈసీజీ, 2డీ ఎకో టెస్టులు కూడా చేశాం. ఆ రెండు కూడా బాగున్నాయి.
• తర్వాత హార్ట్ కు సంబంధించినటువంటి రక్త పరీక్షలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్టులు కూడా నార్మల్ గానే ఉన్నాయి.
• ఈ రిపోర్టులన్నింటిని పరిశీలించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి హృదయానికి సంబంధించిన ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్ లేదని మేం నిర్ధారించాం.
• ఆ తర్వాత ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలించడం జరిగింది.
• మెడకు సంబంధించినటువంటి ఎంఆర్ఐ టెస్టు, అట్లాగే బ్రెయిన్ కు సంబంధించి కూడా ఎంఆర్ఐ టెస్టు చేయడం జరిగింది.
• ఆ టెస్టుల రిపోర్టులన్నీ కూడా మేం డాక్టర్స్ అందరం కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది.
• దానివల్ల ఒక ఫైనల్ కన్ క్లూజన్ కు వచ్చాము. అవి కొన్ని మీకు ఇపుడు చెప్పడం జరుగుతుంది.


డాక్టర్ ఎం.వి.రావు., సీఎం వ్యక్తిగత వైద్యుడు, జనరల్ ఫిజీషియన్
• ముఖ్యమంత్రి ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసారు.
• బాగా నీరసంగా ఉంది. అదేవిధంగా ఎడమచేయి లాగుతూ ఉందని చెప్పారు.
• వెంటనే నేను డాక్టర్ ప్రమోద్ గారితో వెళ్లి పరీక్షలు చేశాం. మాతో పాటు న్యూరో ఫిజీషియన్స్ కూడా వచ్చారు.
• ఎలాగూ ప్రతి సంవత్సరం సీఎం గారికి సాధారణ వైద్య పరీక్షలు చేస్తూ ఉంటాం. కాబట్టి జనరల్ గా పరీక్షలు చేసి, ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాం.
• ముఖ్యమంత్రి గారు హాస్పటల్ కి వచ్చాక రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రామ్,ఈసీజి, 2డి ఎకో టెస్టులు, స్పైన్, బ్రెయిన్ ఎంఆర్ఐ కూడా చేయడం జరిగింది.
• డాక్టర్ ప్రమోద్ చెప్పినట్లుగా వారికి అదృష్టవశాత్తూ ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు.
• అయితే నెక్ ఎం.ఆర్.ఐ లో కొంచెం ఇబ్బంది వచ్చింది.
• సీఎం గారు ఎక్కువగా వార్తా పత్రికలు చదువుతుంటారు, ఐ ప్యాడ్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సమస్య వచ్చింది.
• న్యూరో ఫిజీషియన్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.


• మీకందరికీ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు, మధుమేహం ఉన్నది. అవన్నీ కంట్రోల్లో ఉన్నాయి.
• ఇతర పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. 90శాతం పరీక్షల రిపోర్టులు బాగున్నాయి.
• హార్ట్ కిడ్నీ, లివర్ ఫంక్షన్, కొలెస్టరాల్ లెవల్స్ అన్నీ చాలా బాగున్నాయి.
• సో వారు ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంత వరకు వారికి బ్లడ్ ప్రెషరు, మధుమేహం కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పాం.
• దానికి కారణం ఏమిటంటే వారు ఈ మధ్య టూర్స్ ఎక్కువగా చేస్తుండటం వల్ల వారు కొంచెం నీరసంగా ఉన్నారు.
• స్పీచెస్ ఎక్కువగా ఇస్తున్నారు. వారికి విశ్రాంతి అవసరమని చెప్పాం.
• దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పాం.
• వారికి ఇప్పటినుంచి ప్రతివారం రక్త పరీక్షలు, గ్లూకోజ్ ఎలా ఉందో పరీక్షలు చేస్తాం.
• వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్ప, వారు బాగానే ఉన్నారు.
• వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి చెప్పాం.
• వారం తర్వాత సీఎం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు.

“సీఎం కింద పడ్డారా” అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు…
‘‘లేదు, సీఎం కింద పడలేదు. వారికి ఎడమ చేయి నొప్పి అంటే ఇక్కడకు రమ్మని పరీక్షలు చేశాం’’
అని డాక్టర్ సమాధానమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...