కాళోజీ నారాయణరావును స్మరించుకున్న కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 8: నిత్యం పరుల క్షేమాన్ని పరితపించిన ప్రజాకవి కాళోజీ సాహిత్యం, తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయనను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని సిఎం అన్నారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ, కాళోజీ జయంతిని “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు.
కాళోజీ పేరుపై విశిష్ట పురస్కారం
తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషిచేస్తున్న తెలంగాణ సాహితీవేత్తలను, కవులను, వైతాళికులను గుర్తించి, కాళోజీ నారాయణ రావు’ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నదని సిఎం అన్నారు. ఈ సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారాన్ని అందుకున్న కవి, చరిత్రకారుడు రామోజు హరగోపాల్ కు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.
‘పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది’.. అనే కాళోజీ చైతన్య స్పూర్తిని కొనసాగిస్తూ.. తెలంగాణ రాష్ట్ర, ప్రగతి నమూనాను దేశవ్యాప్తం చేసేందుకు ముందడుగు వేస్తామని సిఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ భాషకు ప్రతీక కాళోజీ సాహిత్యం
Date: