Thursday, March 23, 2023
Homeటాప్ స్టోరీస్గుజరాత్‌లో ఫలించిన పద్మ వ్యూహం

గుజరాత్‌లో ఫలించిన పద్మ వ్యూహం

ఫలించిన పద్మ వ్యూహం
గుజరాత్‌లో కమల వికాసం
ఏడోసారి సత్తాచాటిన‌ బీజేపీ
మరింత బలహీనపడిన కాంగ్రెస్
కనిపించని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం
(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్‌, హైద‌రాబాద్‌)

గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కూడా అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అన్నీ తానై గుజరాత్ ఎన్నికల్లో మంత్రాంగం నడిపిన అమిత్ షా, వరుస పర్యటనలు రోడ్ షోలు నిర్వహిస్తూ నన్ను చూసి ఓటేయ్యండి అన్న మోదీ పిలుపు. డబుల్ ఇంజన్ సర్కార్ అన్న నినాదం బలిమిని చేకూర్చి గెలుపును అందించాయి. క్షేత్రస్దాయినుంచి సమాచార సేకరణ, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని సిట్టింగ్. ఎం ల్ ఏ ల కు సైతం టిక్కెట్లను నిరాకరించడం. ముఖ్యమంత్రి మార్పు 41 మంది పోటీదార్లను బరిలోకి దింప‌డం లాంటి ఆంశాలు విజయానికి దోహదపడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకత మోర్బీ విషాదం. పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి.
సొంత‌ రికార్డు బ్రేక్
1995లో 121 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ…1998లో 117 సీట్లను దక్కించుకుంది. ఆ తర్వాత 2002లో 127 సీట్లలో విజయ ఢంకా మోగించింది. 2007లో 117, 2012లో 115 సీట్లను సొంతం చేసుకుంది. 2017లో 99 సీట్లలో గెలిచి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం 2022లో సాధించిన సీట్ల రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది. గత ఎన్నికల రికార్డులను తనకు తానే అధిగమిస్తూ భారతీయ జనతా పార్టీ విజయ ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. పార్టీ సంస్దాగత వ్యవస్దీకృత పటిష్ట త వల్లే ఈ ఘనత సాధ్యం అన్నది నిర్వివాదాంశం. గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ముందునుంచి దూకుడుగా వ్యవహరించినా స్దానిక నాయకత్వం లేకపోవడం ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆప్ కీలక వ్యక్తుల ప్రమేయం పార్టీకి నష్టాన్ని కలిగించిన ఆంశాలు.

కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను చీల్చి ఓట్ షేర్ పెంచుకుని జాతీయ పార్టీగా ఆవతరించడం అప్ కు ఊరటనిచ్చే ఆంశం.ఏది ఎమైనా గుజరాత్ ఎన్నికల ఫలితాలు రానున్న కాలంలో వివిధ రాష్టాల ఎన్నికలపై , మరియు సార్వత్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి అన్నది విశ్లేషకుల ఆభిప్రాయం ప్రజాస్వామ్య వ్యస్దకు పునాది ఓటు. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుని చేతిలో వజ్రాయుధం ఓటు. ముందస్తు సర్వేలకు విశ్లేషణలకు ఆందని నాడి ఓటర్ ది. ఓటర్ మనస్సులోని చిదంబర రహస్యం తెలిసేది ఫలితాల ద్వారానే పరిపాలకులను సృష్టించే విధాత ఓటరే ప్రజాస్వామ్య వ్యస్దలో ప్రజలే అత్యుత్తమ న్యాయనిర్ణేతలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ