ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు
హోం శాఖ మంత్రి తానేటి వనిత!
ఏపీ క్యాబినెట్లో శాఖల కేటాయింపు!!
అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త క్యాబినెట్ కొలువుదీరిన వేళ ఏ మంత్రికి ఏ శాఖ దక్కింది అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకుముందులానే, ఈ క్యాబినెట్‌లో కూడా ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించారు.

బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, కె. నారాయణ స్వామి, అంజాద్ బాషాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. క్యాబినెట్ కూర్పులో జగన్ మార్కు స్పష్టంగా కనిపించింది. అడక్కుండానే కీలక శాఖ కట్టపెట్టారని జోగి రమేష్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

మంత్రులకు కేటాయించిన శాఖ వివరాలు ఇలా ఉన్నాయి.
పీడిక. రాజన్న దొర – గిరిజన సంక్షేమం (ఉప ముఖ్యమంత్రి)

బూడి ముత్యాల నాయుడు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (ఉప ముఖ్యమంత్రి)

కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ (ఉప ముఖ్యమంత్రి)

నారాయణ స్వామి – ఎక్సయిజ్ (ఉప ముఖ్యమంత్రి)

అంజాద్ బాషా – మైనారిటీ సంక్షేమం (ఉప ముఖ్యమంత్రి)

తానేటి వనిత – హోం, ప్రకృతి విపత్తుల నివారణ

బుగ్గన రాజేంద్రనాథ్ – ఆర్థిక శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్

బొత్స సత్యనారాయణ- విద్యా శాఖ

గుడివాడ అమర్‌నాథ్-ఐటీ పరిశ్రమల శాఖ

దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాల శాఖ

పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ

కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాల శాఖ

జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ

విడదల రజని – వైద్య, ఆరోగ్య శాఖ

ఆదిమూలపు సురేష్ – మున్సిపల్, పట్టణాభివృద్ధి

ఆర్కె రోజా – పర్యాటక, సాంస్కృతిక శాఖ

గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ

ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, స్టాంప్స్

చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ- బీసీ సంక్షేమం

మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమం

అంబటి రాంబాబు – జల వనరుల శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్తు, అటవీ, మైనింగ్

ఉష శ్రీచరణ్ – స్త్రీ శిశు సంక్షేమం

సీదిరి అప్పల రాజు – పశు సంవర్థక శాఖ

కాకాణి గోవర్థన్ – వ్యవసాయం, సహకార మార్కెటింగ్

