ప‌రిథి దాటుతున్న హైకోర్టు: జ‌గ‌న్‌

Date:

ఏపీ ఉన్న‌త న్యాయ‌స్థానంపై సీఎం వ్యాఖ్య‌
హైద‌రాబాద్‌, మార్చి 24:
ఏపీ హైకోర్టు నిర్ణ‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. త‌నకు న్యాయ వ్య‌వ‌స్థ‌పై అత్యంత గౌర‌వ‌ముంద‌ని చెబుతూ, ఆయ‌న రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం అసమంజ‌సం, అవాంఛ‌నీయం అని పేర్కొన్నారు. రాజ‌ధానిని నిర్ణ‌యించుకునే అధికారం రాష్ట్రానిదే అని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. జార్ఖండ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాలు త‌మ రాజ‌ధానుల‌ను తామే నిర్ణ‌యించుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. హైకోర్టు ఉన్న చోటే రాజ‌ధాని ఉండాల‌ని లేద‌న్నారు. రాజ‌ధానిని నిర్ణ‌యించుకునే అధికారం రాష్ట్రానికి ఉంద‌ని కేంద్రం చెబుతుంటే హైకోర్టు మాత్రం లేద‌ని అంటోంద‌నీ..ఇదెక్క‌డి న్యాయ‌మ‌నీ జ‌గ‌న్ అన్నారు. గౌర‌వ న్యాయ స్థానం త‌న ప‌రిథిని దాటి శాస‌న వ్య‌వ‌స్థ‌లోకి రావ‌డం విచార‌క‌ర‌మైన్నారు. రాజ్యాంగం సూచించిన మూడు వ్య‌వ‌స్థ‌ల‌కు ఎవ‌రి ప‌రిథి వారికి ఉంద‌న్నారు. వికేంద్రీక‌ర‌ణపై కొత్త‌గా చ‌ట్టం చేయ‌డ‌కూడద‌ని హైకోర్టు చెబ‌తుఓంద‌న్నారు.

రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌లో వెన‌క‌డుగు వేయ‌మ‌నీ, అది త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌నీ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్ప‌ష్టంచేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి ఎక్క‌డికీ వెళ్ళ‌దు. నేను ఇక్క‌డ ఇల్లు కూడా క‌ట్టుకున్నాను. విస్తృత అభివృద్ధి కోస‌మే రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...