దావోస్‌ చేరుకున్న సీఎం

Date:

ఆదివారం నాడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
సదస్సు తొలిరోజు పలువురితో సమావేశం
దావోస్‌, మే 21:
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ దావోస్‌ చేరుకున్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు.


ఆదివారం నాటి కార్యక్రమాలు:
– వర్డల్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరగనున్న కాంగ్రెస్‌ వేదికగా రేపు ఉదయం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.


– డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌కేర్‌– హెల్త్‌ విభాగం అధిపతి, డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోకూడా సీఎం సమావేశం అవుతారు.


– దీనితర్వాత మ«ధ్యాహ్నం బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హన్స్‌ పాల్‌బర్కనర్‌తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్‌లో సమావేశం కానున్నారు.


– సాయంత్రం డబ్ల్యూఈఎఫ్‌ కాంగ్రెస్‌ వేదికలో జరిగే వెల్‌కం రిసెప్షన్‌కు సీఎం హాజరవుతారు.


జురెక్, దావోస్‌ల్లో సీఎంకు స్వాగతం:
జురెక్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ సీఎంకు సాదర స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగువారు కూడా సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


దావోస్‌లో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు ఉన్నారు. రోడ్డు మార్గంలో సీఎం దావోస్‌ చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌…. ఒక్కొక్కరికి రూ. 1 .90 లక్షలు

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లుతొలిసారిగా...

లడ్డూపై లడాయి

నాటి నుంచి నేటి వరకూ లడ్డూ ప్రసాదం కథ కమామిషు(వాడవల్లి శ్రీధర్)కలియుగ...

అందరమొకటై చేయి చేయి కలిపి… జై జై గణేశ

శిల్ప కాలనీలో ఘనంగా గణేశ ఉత్సవాలు67 వేలకు పెద్ద లడ్డూ, 17...

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...