ఆవ నూనెపై దిగుమ‌తి సుంకం త‌గ్గించ‌రూ!

Date:

వంట నూనెల ధ‌ర‌లు పెరిగి ఇబ్బందులు
ఉక్రెయిన్ యుద్దం వ‌ల్లే ఈ ప‌రిస్థితులు
కేంద్ర మంత్రులు నిర్మ‌ల‌, పీయుష్‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ లేఖ‌లు
ఏపీని ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి
అమ‌రావ‌తి, మే 13:
ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, పియూష్‌గోయల్‌కు లేఖలు రాశారు. వంటనూనెలకు కొరత నేపథ్యంలో ఆవ నూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని ఆ లేఖ‌ల‌లో విజ్ఞప్తి చేశారు. లేఖ‌ల‌లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌నూ, కొర‌త ఏర్ప‌డ‌డానికి కార‌ణాల‌నూ ఆయ‌న వివ‌రించారు. రష్యా ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందనీ, ఈ క్ర‌మంలో ఆవ నూనె దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాల‌నీ ఆయ‌న ఆ లేఖ‌లో కోరారు.


దేశీయంగా వంట నూనెల ఉత్ప‌త్తి 40 శాత‌మే
2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60శాతం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందనీ, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందనీ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. దీనివల్ల సన్‌ఫ్లవర్‌తోపాటు, ఇతర వంటనూనెల ధరలు పెరిగిన విష‌యాన్ని తెలిపారు. రాష్ట్రంలో మూడింట రెండొంతులమంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారని, దీనితర్వాత పామాయిల్‌ను 28శాతం మంది, వేరుశెనగనూనెను 4.3 శాతం మంది వాడుతారనీ వివ‌రించారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బందిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు-కొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుకూడా తీసుకున్నాయని వెల్లడించారు.


ధ‌ర‌ల స‌మీక్ష‌కు, స‌ర‌ఫ‌రాకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
కొరతలేకుండా వంటనూనెలు సరఫరా చేయడానికి, రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌కూడా ఏర్పాటు చేశామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీ చేసేవారితో క్రమం తప్పకుండా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు.
రైతు బ‌జార్ల‌లో స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే నూనె విక్ర‌యం
ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా రైతు బజారల్లో సరసమైన ధరలకే విక్రయిస్తున్నామ‌ని తెలిపారు. ఇతర వంటనూనెల వినియోగంపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆవాల నూనెకూడా సన్‌ఫ్లవర్‌ లానే ఉంటుందని, కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందనీ అన్నారు. ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందనీ దిగుమతికి ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయని, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాదికాలంపాటు ఆవ నూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలనీ కోరారు. తద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుగలుగుతామని సీఎం అభిప్రాయ ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...

నష్టం అపారం … కావాలి కేంద్ర ఆపన్న హస్తం : రేవంత్

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలికేంద్రం తక్షణ సాయం అందించాలిప్రాథమిక అంచనాల ప్రకారం...