Saturday, March 25, 2023
HomeArchieveసంవ‌త్స‌ర నామంలోనే శుభం…అంద‌రికీ శుభం క‌లుగుతుంది

సంవ‌త్స‌ర నామంలోనే శుభం…అంద‌రికీ శుభం క‌లుగుతుంది

ఉగాది వేడుకలలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌
అమ‌రావ‌తి, ఏప్రిల్ 2:
సంవ‌త్స‌రం పేరులోనే శుభం ఉంద‌నీ, ఈ ఏడాది అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌నీ ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభిల‌షించారు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ముఖ్య‌మంత్రి హాజర‌య్యారు. తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, సాంస్కృతిక, పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు స్వాగ‌తం ప‌లికారు. ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత స్వర్గీయ డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్య‌మంత్రి నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం వేదికపై రాష్ట్ర ప్ర‌భుత్వ ఆస్థాన సిద్ధాంతి క‌ప్ప‌గంతు సుబ్బ‌రామ‌సోమ‌యాజులు పంచాంగ శ్రవణం చేశారు. తొలుత సీఎం పంచాంగాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చిన్నారుల‌ను ముఖ్య‌మంత్రి దంప‌తులు ఆప్యాయంగా ప‌లుక‌రించారు.
ఉగాది వేడులను ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులకు ఆస్ధాన సిద్ధాంతి సుబ్బరామసోమయాజులు ఉగాది ప‌చ్చ‌డిని అంద‌జేశారు. సుబ్బరామ సోమయాజులును ముఖ్యమంత్రి స‌త్క‌రించారు.


దేవ‌స్థానాల ఆశీర్వ‌చ‌నం
పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ వేదపండితులు, శ్రీదుర్గామల్లేశ్వ‌ర దేవస్ధానం స్ధానాచార్యులు, అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించేశారు.


సంక్షేమ క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. సమాచారశాఖ కమిషనర్‌ తుమ్మ విజయ్‌కుమార్‌ రెడ్డి క్యాలెండ‌ర్‌ను సీఎంకు అంద‌జేశారు. వ్యవసాయపంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23లను కూడా ఆవిష్కరించారు. సాంస్కృతికశాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సభ్యురాలు జయశ్రీ రచించిన ఆమెకు తోడుగా న్యాయదేవత పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులు ఆవిష్క‌రించారు.
ప్ర‌జలందరికీ ఉగాది శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌
శుభకృతనామ ఉగాది సంవత్సరంలోకి ఈరోజు అడుగుపెడుతున్నామ‌నీ. దేవుడి దయ వలన పంచాంగాలన్నీ కూడా నామములోనే శుభం అన్న మాట కనిపిస్తోంద‌నీ సీఎం జ‌గ‌న్ అన్నారు. ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభం జరుగుతుందని చెపుతున్న నేపధ్యంలో… దేవుడి దయ, ప్రజలందరి చల్లనిదీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నాన‌న్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా … రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.


యార్గ‌గ‌డ్డ పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌
అధికార భాషా సంఘం అధ్యక్షులు పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రచించిన తెలుగు సాహిత్యం,సమాజం చరిత్ర– రెండువేల సంవత్సరాలు అనే పుస్తకాన్ని ముఖ్య‌మంత్రి ఆవిష్కరించారు. ఇదే కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలోని వివిధ దేవస్ధానాలకు చెందిన వేదపండితులను సత్కరించారు. నవరత్నాలు నృత్యరూపకాన్ని చిన్న‌రులు ప్రదర్శించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్‌. మల్లికార్జునరావు రూపొందించిన డీసెంట్రలైజ్డ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.


ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ వైఫ్స్‌ అసోసియేషన్‌ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి సీఎం వైయస్‌.జగన్‌కు విరాళంగా చెక్‌ అందజేశారు.
ఉగాది వేడుకలకు హాజరైన ఉపముఖ్యమంత్రి(ఎక్సైజ్‌శాఖ) కె నారాయణస్వామి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు(కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్‌ పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ