రేపు హైదరాబాద్‌కు పయనం
అదే రోజు తిరిగి తాడేపల్లికి
హైదరాబాద్, ఫిబ్రవరి 6: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అంటే ఫిబ్రవరి 7న హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు, సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి 9.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.