ఆరోగ్య‌శ్రీ రోగుల‌కు 50శాతం బెడ్స్‌

0

ఆస్ప‌త్రుల ఎంపిక‌కు ప్ర‌మాణం కావాలి
హెల్త్ హ‌బ్స్ విధివిధానాలు, కొవిడ్ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష‌లో ఏపీ సీఎం
అమరావతి, సెప్టెంబ‌ర్ 14:
హెల్త్‌హబ్స్‌ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆరోగ్య‌శ్రీ‌కి ఎక్కువ బెడ్లను కేటాయించే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. హెల్త్‌హబ్స్‌ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటార ని సీఎం చెప్పారు. జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌పై మంగ‌ళ‌వారం నాడు క్యాంప్ కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విధివిధానాలపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలతో వివరించారు. వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వివరాలనూ అందించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్‌ ద్వారా నెరవేరుతుందని సీఎం చెప్పారు.
డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలి.
అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలి.
వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని స్పష్టంచేశారు.
లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలి.


ఆస్పత్రుల నిర్వహణపైనా సీఎం సమీక్ష
వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు వివరించిన అధికారులు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమించారు. బిల్డింగ్‌ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను నిర్వహించనున్న అధికారులు.
సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని స్ప‌ష్టంచేశారు. అలాగే రిసెప్షన్‌ సేవలు కూడా కీలకమని తెలిపారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలని తెలిపారు. ఎవరు ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని అభిప్రాయ‌ప‌డ్డారు.


ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణస్థాయి బలోపేతంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదని తెలిపారు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు సంబంధించిన‌ వివరాలను అధికారులు అందించారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ఖ‌రారు చేశారు. నవంబర్‌ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు
వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు.
జ‌నాభా మేర‌కు 104ల వినియోగం
జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు 104 లను వినియోగించాలని సీఎం ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌ విధివిధానాలను, ఎస్‌ఓపీలను ఖరారుచేయాలని కోరారు. పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో సేవలు అందించేలా చూడాలన్నారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జే వి యన్‌ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here