రెవెన్యూ గ్యాప్ భ‌ర్తీ చేయ‌రూ

Date:

ఏపీ సీఎం జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి
కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్‌ షెకావత్‌లతో సీఎం భేటీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5:
రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయాల‌ని ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌, జ‌ల‌శ‌క్తి శాక మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ల‌తో భేటీ అయ్యారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అనంత‌రం ఆయ‌న నిర్మ‌లాసీతారామ‌న్ వ‌ద్ద‌కు వెళ్ళారు.

రెవిన్యూ గ్యాప్‌ భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని,పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు… కార్యక్రమాలకు ఖర్చుచేసిన రూ.32,625.25 కోట్లను భర్తీచేయాలని విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి, ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా… రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధించడం సరికాదని, దీన్ని వెంటనే సవరించాలని సీఎం విజ్ఞప్తిచేశారు. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం.. తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖమంత్రితో సీఎం చర్చించారు.


పోల‌వ‌రం స‌త్వ‌ర పూర్తికి స‌హ‌క‌రించాలి
తర్వాత కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎంవిజ్ఞప్తిచేశారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిరరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

కాంపొనెంట్‌ వారీగా కాకుండామొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. వరదకారణంగా దెబ్బతిన్న ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం పునాదులకు సంబంధించి ఈ సమావేశంలోకూడా చర్చజరిగింది. దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారుచేసిన అంశాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంకు సంబంధించి డయాఫ్రం వాల్‌ ఎలా పటిష్టంచేయాలి? లేదా కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై వరుసగా నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, ఇవికూడా వారం పదిరోజుల్లో ఖరారు అవుతాయని సీఎంకు తెలిపారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని సీఎం విజ్ఞప్తిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...