అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు
అమరావతి, జూలై 9: అమర్‌నాథ్ యాత్రలోకుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమన్వయం చేసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.