Monday, March 27, 2023
HomeAP Newsఏపీ విద్యా విధానానికి రీఫ్‌మన్ ప్ర‌శంస‌

ఏపీ విద్యా విధానానికి రీఫ్‌మన్ ప్ర‌శంస‌

వైయ‌స్ జ‌గ‌న్‌తో మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ
దేశంలో గొప్ప న‌గ‌రంగా విశాఖ రూపొందే అవ‌కాశం
అమ‌రావ‌తి, మే 17:
అమెరిక‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ జోయ‌ల్ రీఫ్‌మన్ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోయల్‌ రీఫ్‌మన్‌ తన ఫేర్‌వెల్‌ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమ‌య్యారు. వివిధ‌ అంశాలపై చర్చించారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు మెరుగుకు, అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అమెరికన్‌ కాన్సులేట్‌కు సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం చేసిన కృషిని కొనియాడారు. విద్యావిధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను ప్రత్యేకంగా అభినందించారు. వైద్య, ఆరోగ్యరంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోవిడ్‌ మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఏపిని ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిపారని జోయల్‌ రీఫ్‌మెన్‌ అన్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన కొనియాడారు. ఆంధ్ర అమెరికాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు. దేశంలోని గొప్ప నగరాలలో ఒకటిగా రూపొందేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలున్నాయని ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. మహిళలు, బలహీనవర్గాలకు 50శాతంపైగా ప్రాధాన్యతనివ్వడాన్ని కొనియాడారు. అన్ని రంగాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు.
పాఠ‌శాల విద్య‌పై ప్రోత్సాహ‌క చ‌ర్య‌లకు అభినంద‌న‌
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి తీసుకున్న ప్రోత్సాహక చర్యలను అభినందించారు. విశాఖపట్నంలో అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించడానికి యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌కు అందించిన సహాయానికి సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాక దాని పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. తన మూడేళ్ళ పదవీకాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఆంధ్రా అమెరికా సత్సంబంధాల విషయంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రత్యేక చొరవను ఈ సమావేశంలో ప్రస్తావించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ ఎం.హరికృష్ణ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ