కొడిగట్టిన హరిత విప్లవ జ్యోతి

Date:

మంకొంబు సాంబశివన్ స్వామినాథన్
(వాడపల్లి శ్రీధర్)

బెంగాల్‌ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో తన మనసు మార్చుకుని వైద్య రంగం నుంచి వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. అదే సమయంలో 1960ల్లో భారత్‌ తీవ్ర కరవు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖకు సలహాదారుగా ఉన్న ఎంఎస్‌ స్వామినాథన్‌.. మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్‌ బోర్లాగ్‌ను దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ.. మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్‌లో పండించారు. మంచి దిగుబడి రావడంతో భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది. స్వామినాథన్‌ను భారత హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణిస్తారు. వ్యవసాయంలో స్వామినాథన్ కృషి వల్ల బియ్యం, గోధుమలు, శనగలు, మొక్కజొన్న మొదలైన ఆహార పదార్థాల ఉత్పాదకత పెరిగింది. హరిత విప్లవం సమయంలో, స్వామినాథన్ వ్యవసాయం కోసం అధునాతన వ్యవసాయ పరికరాలపై దృష్టి సారించారు. ఫలితం యంత్రాల సరఫరా పారిశ్రామిక వృద్ధిని కూడా ప్రభావితం చేసింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రదర్శనలు గ్రామీణ ప్రజల దృక్పథాలను మార్చాయి. వ్యవసాయంలో కొత్త సమాచారాన్ని పొందడానికి, వాటిని అమలు చేయడానికి రైతులు కొత్త వ్యవసాయ పద్ధతులను స్వీకరించారు..పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా స్వామినాథన్ కొన్ని ప్రయోగాలు, పరిశోధనలూ చేసి.. సరికొత్త వంగడాలను సృష్టించి.. వ్యవసాయ విధానాల్లో చాలా మార్పులు చెయ్యడంతో… భారతదేశ వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. దిగుబడి బాగా పెరిగింది. భారత దేశం ఇతర దేశాలపై ఆహారం కోసం ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయం గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది. స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా శాంతి బహుమతి, ఇందిరా జాతీయ సమైక్యతా పురస్కారాలు కూడా పొందారు. భారత దేశానికి ఓ శాస్త్రవేత్తగా, హరిత విప్లవ పితామహునిగా స్వామినాథన్ ఎనలేని సేవలు అందించారు. ఆయన సేవలను భారత్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...