భోగాపురం విమానాశ్రయానికి 3na జగన్ శంకుస్థాపన

Date:

తీరనున్న ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ
అదానీ డేటా సెంటర్ కూ శ్రీకారం
అమరావతి, మే 2 :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ బుధవారం నాడు శంకుస్ధాపన చేయనున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా…రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ (అదానీ గ్రూప్‌), రూ. 194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్‌ పనులకు విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాలను విస్తరిస్తారు.
రూ. 21,844 కోట్లతో వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ (అదానీ గ్రూప్‌)
అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్‌ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.
తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీరుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీరు అందించడమే లక్ష్యంగా రూ. 194.40 కోట్ల వ్యయంతో తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్‌ పనులు, డిసెంబర్‌ 2024 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడతారు.
చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ. 23.73 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, అన్ని కాలాల్లో సముద్రంలో సులువుగా చేపలు వేటాడేందుకు వెసులుబాటు, తుఫాను, విపత్తు సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బతినకుండా లంగర్‌ వేసే సదుపాయం కల్పిస్తారు. మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది.


భోగాపురం ఎయిర్‌పోర్టు విశేషాలు
భూసేకరణ, టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి ఎన్‌వోసీ, పర్మిషన్‌లు తీసుకొచ్చి ఎన్‌జీటీ, హైకోర్టు, సుప్రింకోర్టులలో న్యాయవివాదాలు పరిష్కరించి భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల ప్రారంభానికి సర్వం సిద్దమైంది.
పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్‌ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడిసీఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్‌ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానిస్తారు.
అంతర్జాతీయ ఎగ్జిమ్‌ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్‌ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ అభివృద్ది చేస్తారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అప్రాన్, ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అండ్‌ టెక్నికల్‌ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్‌ నిర్మిస్తారు.
16 వ నెంబర్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, కమర్షియల్‌ అప్రోచ్‌ రోడ్, సోలార్‌ ప్యానెల్స్‌ ఏరియా, ఏవియేషన్‌ అకాడమీ, మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవర్‌ హాలింగ్‌ సౌకర్యాలు కల్పిస్తారు.
విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది.
ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పునరావాసం
విమానాశ్రయం కోసం స్వచ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం, శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది


అదానీ డేటా సెంటర్‌
డేటా హబ్‌తో గణనీయంగా పెరగనున్న డేటా స్పీడ్, సింగపూర్‌ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్‌ మెరైన్‌ కేబుల్‌ ఏర్పాటు, తద్వారా ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ 5 రెట్లు పెరిగి భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుంది.
విశాఖలో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల వృద్ది, భారీ స్ధాయిలో హైటెక్‌ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం, విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదలకు అవకాశం.
అధునాతన టెక్‌ కంపెనీలు విశాఖపట్నం ను ఎంచుకునే వీలు, తద్వారా ఐటీ రంగంలో ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయి.
డేటా సెంటర్‌కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్‌ యూనివర్శిటీ, స్కిల్‌ సెంటర్‌ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపునకు మరింత ఊతం, బిజినెస్‌ పార్క్‌ రిక్రియేషన్‌ సెంటర్ల ద్వారా ఉద్యోగుల జీవన శైలి మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...